For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా: హీరో శర్వానంద్

11:27 PM Dec 29, 2021 IST | Sowmya
Updated At - 11:27 PM Dec 29, 2021 IST
tollywood news  ఇది నా సినిమానో  శ్రీ కార్తీక్ సినిమానో కాదు   ఇది వాళ్ల అమ్మ సినిమా  హీరో శర్వానంద్
Advertisement

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ఒకే ఒక జీవితం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.. ఇప్పుడే మొత్తం మాట్లాడలేను. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నరేషన్ అప్పటి నుంచి ఆమె మా వెనకాల నుంచి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్. ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్యలేరు. కానీ పాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు.

Advertisement GKSC

ఈ స్టోరి చెప్పగానే అమల గారు చేస్తున్నారా అని అడిగాను. నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమల గారి పాత్ర. ఈ పాటను రిలీజ్‌ చేయడం లేదు. ఒక చిన్న ఈవెంట్ చేసి.. కుదిరితే శాస్త్రి గారి అమ్మగారిని, అమల గారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం’ అని అన్నారు.Oke Oka Jeevitham is Good Mesege Movie,Hero Sharvanand,Actress Amala,Director SR Prabhu,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image