కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్న తారక్
12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
Advertisement 
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్, హాజరవుతారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో పాటు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్‌కు ఆహ్వానాలు అందాయి. పునీత్ రాజ్‌కుమార్‌తో ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్టీఆర్‌కు విశేషమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల తర్వాత అక్కడ చాలా మంది ఫ్యాన్స్ తారక్‌కి ఉన్నారు.
Advertisement  
 
 

 
  
  
  
  
 