తారక్- ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అదేనా?
03:11 PM May 11, 2024 IST | Sowmya
UpdateAt: 03:11 PM May 11, 2024 IST
Advertisement
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్.. ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించి ‘జై లవకుశ’ సినిమాలో ‘అసుర.. అసుర.. ’ అంటూ అద్దిరిపోయే థీమ్ సాంగ్ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమాలో ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిళ్లను ఆ మూవీ టీమ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై చిత్రబృందం అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ‘అసుర’ టైటిల్‌నే ఫిక్స్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే.
Advertisement
Advertisement