For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తున్న "మాచర్ల నియోజకవర్గం"

03:13 PM May 11, 2024 IST | Sowmya
UpdateAt: 03:13 PM May 11, 2024 IST
ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తున్న  మాచర్ల నియోజకవర్గం
Advertisement

నితిన్- ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి- శ్రేష్ఠ్ మూవీస్- 'మాచర్ల నియోజకవర్గం' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది.

Advertisement

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది చిత్ర యూనిట్. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో నితిన్, కృతి శెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నితిన్, కృతిశెట్టి జోడి చాలా బ్యూటీఫుల్ అండ్ రెఫ్రెషింగ్ గా వుంది. స్టిల్ లో కనిపిస్తున్న ఈ పాటని యూరప్ లొకేషన్ లో చిత్రీకరించారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు. 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Shooting Completed, Except For A Song,Telugu Golden TV, My Mix Entertainments,www.teluguworldnow.com,v9 news telugu.1

Advertisement
Tags :
Author Image