For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది

10:57 PM Mar 27, 2022 IST | Sowmya
Updated At - 10:57 PM Mar 27, 2022 IST
ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది
Advertisement

యంగ్ హీరో నితిన్ విలక్షణమైన క‌థాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా న‌టిస్తున్న‌ చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు.

"నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.. అంటూ  మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సంద‌ర్భంగా నితిన్ ట్వీట్ చేశారు.

Advertisement GKSC

ఈ లుక్‌ లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది. మెడ‌లో వెండిలాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌ గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Charge (First Look) Out,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.jpg1

Advertisement
Author Image