For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మార్చి 26న "మాచర్ల నియోజకవర్గం" లో నితిన్ ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్)

09:56 PM Mar 24, 2022 IST | Sowmya
Updated At - 09:56 PM Mar 24, 2022 IST
మార్చి 26న  మాచర్ల నియోజకవర్గం  లో నితిన్ ఫస్ట్ ఛార్జ్  ఫస్ట్ లుక్
Advertisement

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతూ తెర‌కెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి  నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఫైట్ మాస్ట‌ర్ అనల్ అరసు నేతృత్వం‌లో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు.

Advertisement GKSC

ఈ సంద‌ర్భంగా, `మాచర్ల నియోజకవర్గం` ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నం గా మార్చి 26న  ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్న‌ట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు  శైలిలో ప్రకటన విడుద‌ల చేశారు.

మ‌రోవైపు, : “ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది - శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డ‌ర్ కాపీలో పేర్కొన్నారు.

Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Charge (First Look) On March 26th,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

గుంటూరులో జిల్లా కలెక్టర్‌ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్ర‌టి మ‌ర‌క‌ల‌తో నిండి ఉంది.  రాజ‌కీయ నేప‌థ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.

Advertisement
Author Image