For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sarkaru Naukari : 'సర్కారు నౌకరి' నుంచి 'నీ పసుపు పాదాలే..' లిరికల్ సాంగ్ రిలీజ్

06:45 PM Dec 17, 2023 IST | Sowmya
Updated At - 06:45 PM Dec 17, 2023 IST
sarkaru naukari    సర్కారు నౌకరి  నుంచి  నీ పసుపు పాదాలే    లిరికల్ సాంగ్ రిలీజ్
Advertisement

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ పసుపు పాదాలే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'నీ పసుపు పాదాలే..' పాటకు శాండిల్య పీసపాటి బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేసి కీర్తనతో కలిసి పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. 'నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా... నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనా.. కంచు మట్టె సప్పుల్లో ఇళ్లే కళ్లు తెరిసి సూసెనా...'అంటూ నవ వధువు అత్తింట్లో అడుగుపెట్టిన సంతోషకరమైన సందర్భంలో సాగుతుందీ పాట. కథలో భాగంగా ఈ పాటను పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement GKSC

నటీనటులు : ఆకాష్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు

టెక్నికల్ టీమ్ :
నిర్మాత : కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం : గంగనమోని శేఖర్
సహా నిర్మాత : పరుచూరి గోపాల కృష్ణ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోవెలమూడి మాధవి
సంగీతం : శాండిల్య, నేపధ్య సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ
పబ్లిసిటీ డిజైనర్ : ధని ఏలే
పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
కాస్ట్యూమ్ డిజైనర్ : ఆలా రితీశా రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: కార్తికేయ శ్రీనివాస్.
ఆర్ట్ డైరెక్టర్ : రవి కుమార్ గుర్రం
కో డైరెక్టర్స్ - రమేష్ నాయుడు దాలే, అజర్ షేక్

Advertisement
Author Image