For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: ఈ నెలలో "నీ జతగా" విడుదల

11:47 AM Sep 22, 2021 IST | Sowmya
Updated At - 11:47 AM Sep 22, 2021 IST
film news  ఈ నెలలో  నీ జతగా  విడుదల
Advertisement

శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై,  భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న సినిమా "నీ జతగా"....ఈ చిత్రం  ఈ సెప్టెంబర్ లో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా

ఈ మూవీ డైరెక్టర్ భమిడిపాటి వీర మాట్లాడుతూ* .. మా టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిచింది, అలాగే మా మూవీ లోని సాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారు రాయటం అలాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదములు అని తెలిపారు. అలాగే మా మా పాడిన అనురాగ్ కులకర్ణి కి కూడా ధన్యవాదాలు అని తెలిపారు

Advertisement GKSC

ప్రొడ్యూసర్ రామ్.బి మాట్లాడుతూ... గతం లో మా సినిమా టీజర్ కి  మంచి స్పందన లభించింది, అనంత్ శ్రీరామ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం అందరూ  ఆదరిస్తారు అని కోరుకుంటున్నాం, ఇక పోతే ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించటం జరిగింది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమా మీద చాలా నమ్మకం తో వున్నారు, అందువలన ఇలాంటి కోవిడ్ సిట్యుయేషన్ లో మాకు ఇది ఒక శుభసూచికంగా భావిస్తున్నాం, మా సినిమా ని తప్పకుండా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను.

ఈ మూవీ లో ఇదే ఇదే సాంగ్ రాసిన అనంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ యొక్క సారాంశాన్ని చాలా క్లుప్తంగా వివరించారు, ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలయినప్పుడు ట్రక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సాంగ్ మొదలు అవుతుంది, ఈ సాంగ్ లో పకృతి గురించి చాలా ఆహ్లాదకరమయిన పదాలు జోడించి ఈ సాంగ్ రాయటం జరిగింది అని అనంత్ శ్రీరామ్ గారు చెప్పటం జరిగింది.

Nee Jathaga Movie Ready to Release in This Month,Latest Telugu Movies.Bharath Bandaru,Gnaneshwari,Bhamidipati Veera,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1నటి నటులు :
భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సాయిరాం బి.ఏస్,రఘవీరా చారి,నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ :శ్రీ సుబంద్రా క్రియేషన్స్
ప్రొడ్యూసర్ :రామ్ బి
డైరెక్టర్ :భమిడిపాటి వీర
లిరిక్స్ :అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ :పవన్
సింగర్ : అనురాగ్ కులకర్ణి
డి ఓ పి :కె వి శ్రీధర్
ఎడిటర్ :ప్రభు
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Nee Jathaga Movie Ready to Release in This Month,Latest Telugu Movies.Bharath Bandaru,Gnaneshwari,Bhamidipati Veera,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image