Entertainment : ఎన్టీఆర్ కంటే గొప్ప డాన్స్ లేరు.. నయన తార
Entertainment సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి నయనతార తాజాగా ఈ భామ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకు వచ్చిన ఈమె టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
తాజాగా నయనతార టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ గురించి మాట్లాడింది అయితే ఆయన గురించి చెప్తూ పొగడ్తలు ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ అంటూ షూటింగ్ సమయంలో అసలు ప్రాక్టీస్ కూడా చేయకుండా డాన్స్ చేయగలరని అతనితో సమానంగా ఏ హీరోయిన్ కూడా డాన్స్ చేయలేదు అంటూ చెప్పకు వచ్చింది.. అలాగే కొరియోగ్రాఫర్ కంటే బెటర్ గా చేశాడు కదా అనిపించేటట్టు ఎన్టీఆర్ చేస్తాడని రిహార్సల్స్ చేయకుండా షూట్ కు రెడీ అయ్యేంత సత్తా అతనిలో ఉందంటూ చెప్పుకొచ్చింది అలాగే ఎన్టీఆర్ సినిమా సమయంలో సెట్ లో ఉన్న వారంతా అతని ఎనర్జీని చూసి షాక్ అవుతారంటూ తెలిపింది..
అలాగే బాలకృష్ణ కోసం కూడా చెప్పుకొచ్చిన ఈమె అతనితో మరోటేక్ అడిగేందుకు కొందరు హీరోయిన్లు చాలా భయపడతారని అయితే అతను చాలా హ్యాపీ పర్సన్ అంటూ చెప్పింది ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా జాలిగా ఉంటుందని అలాగే తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది.. అలాగే మెగాస్టార్ చిరంజీవి అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తన స్టార్ట్ను ప్రదర్శించారని వెంకటేష్ కూడా ఎంతో ఫ్యామిలీ మెన్ లా ఉంటారంటూ.. చెప్పుకొచ్చిన నయనతార నాగార్జున ఛార్మింగ్ పర్సన్ అంటూ తెలిపింది..