For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి కొత్త మూవీ లో 'హతవిధీ ' సాంగ్ రిలీజ్ .. అధి హీరో ధనుష్ పాడడం విశేషం .. వివరాలు తెలియాలి అం

01:34 PM May 31, 2023 IST | Sowmya
Updated At - 01:34 PM May 31, 2023 IST
naveen polishetty   నవీన్ పోలిశెట్టి కొత్త మూవీ లో  హతవిధీ   సాంగ్ రిలీజ్    అధి హీరో ధనుష్ పాడడం విశేషం    వివరాలు తెలియాలి అం
Advertisement

Naveen Polishetty:‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). ఈ మూవీలో తనకు అనుష్క (Anushka) జంటగా కనిపించనుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై (UV Creations) వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మిడిల్ ఏజ్‌‌ వచ్చినా పెళ్లి చేసుకోని ఉమన్ చెఫ్ క్యారెక్టర్ పోషించింది అనుష్క. తనతో స్టాండప్ కమెడియన్ నవీన్ పొలిశెట్టి ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండనున్నాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లో నవీన్.. తన నేచురల్ ఫ్లోలో కామెడీ ఇరగదీశాడు.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ చిత్రం నుంచి ‘హతవిధీ’ (Hathavidi) అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో లవ్ ట్రబుల్స్‌ను వివరించే ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) పాడటం విశేషం.

Advertisement GKSC

ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ధనుష్ అద్భుతంగా పాడాడు. ప్రత్యేకించి హీరో హార్ట్ బ్రేకప్, లవ్ కష్టాల గురించి వివరించే ఈ పాట ధనుష్ వాయిస్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంది. తను గతంలో పాడిన ‘కొలవెరి ఢీ’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ లిరిక్స్ విషయానికొస్తే.. ‘హతవిధీ.. ఏందిది. ఊహలో.. లేనిది. బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది. చిటపటాసు ఫాదరు.. కట్ కటీఫ్ లవ్వరు.. నట్టనడుమ జిందగీ అప్పడమైనది. వాటే డ్యామేజీ.. చెవిలో క్యాబేజీ. ఎట్టా కుదురుద్ది టేక్ ఇట్ ఈజీ. చెరిగిపోయిందే స్మైలీ ఎమోజీ. లైఫ్ డైరీలో మిగిలింది ఖాళీ పేజీ’ అంటూ చాలా క్యాచీగా ఉన్నాయి.

Advertisement
Author Image