For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: నేచురల్‌ స్టార్‌ నాని "శ్యామ్‌సింగ రాయ్‌’" చిత్రం షూటింగ్‌ పూర్తి

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
tollywood news  నేచురల్‌ స్టార్‌ నాని  శ్యామ్‌సింగ రాయ్‌’  చిత్రం షూటింగ్‌ పూర్తి
Advertisement

Natural Star Nani’s "Shyam Singha Roy" Movie Shooting Completed, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Telugu World Now

Tollywood News: నేచురల్‌ స్టార్‌ నాని ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ పూర్తి

Advertisement GKSC

కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది. వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో ‘శ్యామ్‌సింగరాయ్‌’ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది.

‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్‌ మేకోవర్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రం నుంచి విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

ఒక యూనిక్‌ స్టోరీతో తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో బడ్జెట్‌ పరంగా ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు. ‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌ పూర్తయ్యింది. ఔట్‌పుట్‌ పట్ల నేను మా టీమ్‌ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేం అనుకున్న సమయంలో షూటింగ్‌ పూర్తిచేయడానికి పూర్తి సహాకారం అందించిన యూనిట్‌ కి కృతజ్ఞతలు అని నిర్మాత వెంకట్‌ బోయనపల్లి అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో నాని శ్యామ్‌సింగరాయ్‌ లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. బెంగాల్‌ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతంగా వేసిన టెంపుల్‌ సెట్‌లో కొన్ని ప్రధానమైన, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ముగ్గురు బ్యూటిఫుల్‌ హీరోయిన్స్‌ సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ ఈ చిత్రంలో నటించారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు అసోసియేటైయ్యారు.

నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నాసెబాస్టియన్, రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం, జీస్సూసేన్‌ గుప్తా, లీలా స్యామ్‌సన్‌ , మణీశ్‌ వడ్వ, బరున్‌ చంద తదితరులు

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్‌: రాహుల్‌ సంకృత్యాన్‌
నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి
బ్యానర్‌: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
ఒరిజినల్‌ స్టోరీ: సత్యదేవ్‌ జంగా
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్ల
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ .వెంకటరత్నం (వెంకట్‌)
ఎడిటర్‌: నవీన్‌ నూలి
ఫైట్స్‌: రవి వర్మ
పీఆర్‌ఒ: వంశీ –శేఖర్‌

Advertisement
Author Image