For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie Updates: న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన "భళా తందనాన" టీజర్

06:21 PM Jan 28, 2022 IST | Sowmya
Updated At - 06:21 PM Jan 28, 2022 IST
movie updates  న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన  భళా తందనాన  టీజర్
Advertisement

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'భళా తందనాన' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. నేడు న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదల‌చేశారు.

‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొద‌లైంది. రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది.

Advertisement GKSC

Natural Star Nani Launched Teaser Of Sree Vishnu, Director Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1 ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించారు. నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు. కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం బాగా కుదిరాయి.

నటీనటులు : శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్ర రాజు

సాంకేతిక బృందం : దర్శకుడు: చైతన్య దంతులూరి, నిర్మాత: రజనీ కొర్రపాటి, సమర్పణ: సాయి కొర్రపాటి, బ్యానర్: వారాహి చలన చిత్రం, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, సినిమాటోగ్రఫర్: సురేష్ రగుతు,యాక్షన్ కొరియోగ్రఫర్: పీటర్ హెయిన్, ఆర్ట్ డైరెక్టర్: గాంధి నడికుడికర్, రచయిత : శ్రీకాంత్ విస్సా, పీఆర్ఓ : వంశీ-శేఖర్.

Advertisement
Author Image