For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies: నాని చేతుల మీదుగా విడుద‌లైన "సుమ కనకాల" "జయమ్మ పంచాయితీ" నుంచి "తిప్పగలనా" పాట

08:10 PM Nov 23, 2021 IST | Sowmya
UpdateAt: 08:10 PM Nov 23, 2021 IST
latest telugu movies  నాని చేతుల మీదుగా విడుద‌లైన  సుమ కనకాల   జయమ్మ పంచాయితీ  నుంచి  తిప్పగలనా  పాట
Advertisement

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్నఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నేడు ఈ సినిమాలోని మొదటి పాట తిప్పగలనా? లిరికల్ వీడియోను నేచుర‌ల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ఇందులో విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటలో సుమ ఫ్యామిలీని కూడా చూపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.

Advertisement

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు.

Natural Star Nani Launched First Lyrical Thippagalana From Suma Kanakala,Jayamma Panchayathi,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.comనటీనటులు : సుమ కనకాల, దేవీ ప్రసాద్, దినేష్, షాలినీ తదితరులు

సాంకేతిక బృందం :
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్:  విజయ్ కుమార్ కలివారపు
సంగీతం: ఎంఎం కీరవాణి
డీఓపీ: అనుష్ కుమార్
ఎడిటర్: రవితేజ గిరిజాల
నిర్మాత: బలగ ప్రకాష్
సమర్ఫణ: శ్రీమతి విజయ లక్ష్మీ
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
ఆర్ట్: ధను అంధ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్-అఖిల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచర్ల
కాస్ట్యూమ్స్:  హరి ప్రియ
పీఆర్వో:  వంశీ-శేఖర్
డిజిటర్ పీఆర్‌: మనోజ్ వల్లూరి
డిజిటల్ ప్రమోషన్స్: హ్యాష్ ట్యాగ్ మీడియా

Advertisement
Tags :
Author Image