For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'మైఖేల్' థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ

03:16 PM Jan 24, 2023 IST | Sowmya
Updated At - 03:16 PM Jan 24, 2023 IST
 మైఖేల్  థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ
Advertisement

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ తో ఆశ్చర్యపరిచారు మేకర్స్. మైఖేల్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ  మైఖేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమలేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా తనతో ప్రేమలో పడితే, హార్ట్ బ్రేక్ అవుతుందని హెచ్చరిస్తుంది. యంగ్ సందీప్ కిషన్ ఒకరిని తుపాకీతో కాల్చడంతో ట్రైలర్ ముగుస్తుంది. విజయ్ సేతుపతి వార్నింగ్ ఇస్తూ కనిపించడం ట్రైలర్ కి మరింత సీరియస్ నెస్ ని తీసుకొచ్చింది.Natasimham Nandamuri Balakrishna Launched The Theatrical Trailer Of Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michaelట్రైలర్ మైఖేల్ ఒక అందమైన ప్రేమకథ, స్టైలిష్ విజువల్ ట్రీట్‌మెంట్‌తో ఇంటెన్స్ , యాక్షన్ ఎంటర్ టైనర్ అనే అభిప్రాయాన్ని ఇస్తుంది. గ్యాంగ్‌స్టర్ కార్లు, రెడ్-థీమ్ బ్యాక్‌డ్రాప్‌లు,  రెట్రో దుస్తులను చూపడం ద్వారా వింటేజ్ అనుభూతిని కలిగిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అని అర్ధమౌతుంది. ప్రతి సన్నివేశంలో  రంజిత్  ఎఫర్ట్ కనిపిస్తోంది. మైఖేల్ పాత్రలో సందీప్ కిషన్ జీవించాడు. సందీప్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. తన ప్రేయసి పట్ల వున్న ప్రేమ, పెయిన్ రెండింటినీ అద్భుతంగా గ్రేట్ ఇంటెన్స్ తో పెర్ ఫార్మ్ చేశాడు. విజయ్ సేతుపతి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్షన్ రోల్‌లో ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ సందేశ్ సాలిడ్ రోల్ కనిపించాడు. అనసూయ భరద్వాజ్ బలమైన పాత్రలో కనిపించింది.

Advertisement GKSC

కిరణ్ కౌశిక్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. రా ఎనర్జీని బాగా క్యాప్చర్ చేసింది. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  రానెస్ ని ఎలివేట్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ సన్నివేశాలకు స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ రాశారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి,  మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాణ విలువలు ఆత్యద్భుతంగా వున్నాయి.

Advertisement
Author Image