For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ 'వీరసింహారెడ్డి' మాస్ మొగుడు సాంగ్

11:13 PM Jan 09, 2023 IST | Sowmya
Updated At - 11:13 PM Jan 09, 2023 IST
నందమూరి బాలకృష్ణ  శృతి హాసన్  వీరసింహారెడ్డి  మాస్ మొగుడు సాంగ్
Advertisement

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్  కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ 'మాస్ మొగుడు'ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్,  ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య బెహరా సూపర్ ఎనర్జిటిక్‌గా పాడారు . రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ పాటలో బాలకృష్ణ లైవ్లీగా, గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశారు. శృతి హాసన్, బాలకృష్ణ  గ్రేస్ కు తగ్గట్టుగా గ్లామరస్ గా కనిపించింది.

Advertisement GKSC

వైబ్రెంట్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ కలర్‌ఫుల్‌గా కనిపించాయి. ఆఖరి విజువల్స్ లో పవన్ కళ్యాణ్ సెట్ లోకి రావడం కనిపించింది. గోపీచంద్ మలినేనికి వీరసింహా రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్‌తో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ కు అన్ని వర్గాల నుండి  అద్భుతమైన స్పందన వచ్చింది.

Advertisement
Author Image