For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నంద‌మూరి బాల‌కృష్ణ‌ #NBK107 షూటింగ్ ప్రారంభం

10:59 PM Feb 18, 2022 IST | Sowmya
Updated At - 10:59 PM Feb 18, 2022 IST
నంద‌మూరి బాల‌కృష్ణ‌  nbk107 షూటింగ్ ప్రారంభం
Advertisement

అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో బాల‌య్య‌107వ సినిమాగా ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ నేడు సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టారు మేక‌ర్స్‌. బాలకృష్ణ - ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.

Advertisement GKSC

మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వ‌నున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Shoot Commences Today,telugu golden tv, my mix entertainments, teluguworldnow.comనటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజ‌య్, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌

సాంకేతిక బృందం: స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్:  గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: తమన్ ఎస్, డీఓపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్ :  రామ్‌- లక్ష్మణ్, సీఈవో : చెర్రీ, కో డైరెక్టర్:  కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్వో : వంశీ-శేఖర్.

Advertisement
Author Image