For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: "బాలకృష్ణ" సరసన "శ్రుతీ హాసన్" హీరోయిన్‌గా పుల్ మాస్ మసాల చిత్రం #NBK107

11:59 AM Nov 14, 2021 IST | Sowmya
Updated At - 11:59 AM Nov 14, 2021 IST
tollywood news   బాలకృష్ణ  సరసన  శ్రుతీ హాసన్  హీరోయిన్‌గా పుల్ మాస్ మసాల చిత్రం  nbk107
Advertisement

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు. అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.

Advertisement GKSC

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్

సాంకేతిక బృందం:
డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : తమన్ ఎస్
సీఈఓ : చెర్రీ

Advertisement
Author Image