For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'భగవంత్ కేసరి’ టీజర్ జూన్ 10న 108+ థియేటర్లలో స్క్రీనింగ్

02:09 PM Jun 12, 2023 IST | Sowmya
UpdateAt: 02:09 PM Jun 12, 2023 IST
 భగవంత్ కేసరి’ టీజర్ జూన్ 10న 108  థియేటర్లలో స్క్రీనింగ్
Advertisement

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ సాహు గారపాటి, హరీష్ పెద్ది.. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న #NBK108 కు 'భగవంత్ కేసరి' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఈ రోజు అనౌన్స్  చేశారు. క్రేజీ  కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈ టైటిల్ యాప్ట్.  'ఐ డోంట్ కేర్' అనేది ట్యాగ్‌ లైన్ , టైటిల్ పోస్టర్‌ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ తో ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్‌ ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు. టైటిల్ పోస్టర్ లాగే టీజర్ విషయంలో కూడా అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. టీజర్ ప్రపంచవ్యాప్తంగా 108+ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

Advertisement

ఇప్పటికే టైటిల్ పోస్టర్‌ తో సంబరాలు మొదలయ్యాయి. స్పెషల్ డేట్‌ లో వచ్చే టీజర్‌ తో అభిమానులు సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

యూనిక్ స్క్రిప్ట్‌ తో సరికొత్త యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న భగవంత్ కేసరి షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఇందులో కోర్ టీమ్ పాల్గొంటుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ చిత్రానికి  ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Tags :
Author Image