హీరో నాగ శౌర్య "కృష్ణ వ్రిందా విహారి" టీజర్
11:10 PM Mar 27, 2022 IST | Sowmya
Updated At - 11:10 PM Mar 27, 2022 IST
Advertisement
యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. నాగశౌర్య తొలిసారి బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ టీజర్కి సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చింది. కృష్ణ వ్రిందా విహారి టీజర్ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్లో నాగ శౌర్య, షిర్లీ సెటియా రొమాంటిక్ పోజ్లో కనిపిస్తున్నారు.
Advertisement