For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: నాగశౌర్య, అనీష్‌కృష్ణ, ఐరా క్రియేషన్స్‌ మూవీ షూటింగ్ పునః ప్రారంభం.

03:04 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:04 PM May 11, 2024 IST
film news  నాగశౌర్య  అనీష్‌కృష్ణ  ఐరా క్రియేషన్స్‌ మూవీ షూటింగ్ పునః ప్రారంభం
Advertisement

Naga Shaurya, Anish Krishna, IRA Creations Film’s Shoot Resumes, Shirley Setia, Radhika, Latest Telugu Movies, Telugu World Now

FILM NEWS: నాగశౌర్య, అనీష్‌కృష్ణ, ఐరా క్రియేషన్స్‌ మూవీ షూటింగ్ పునః ప్రారంభం.

Advertisement GKSC

హ్యాండ్‌సమ్‌ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ తిరిగి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్‌ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమా అవుట్ పుట్‌ అద్భుతంగా వస్తుందని తెలుస్తోంది.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయగ్రాహకులు.

నటీనటులు: నాగశౌర్య, షీర్లే సేతియా, రాధిక, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదితరులు...

సాంకేతిక విభాగం:
దర్శకుడు: అనీష్‌ కృష్ణ
ప్రొడ్యూసర్‌: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి
బ్యానర్‌: ఐరా క్రియేషన్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: సాయిశ్రీరామ్‌
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్‌: తమ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌
డిజిటల్‌ హెడ్‌: ఎమ్‌ఎన్‌ఎస్‌ గౌతమ్‌
పీఆర్‌ఓ: వంశీ–శేఖర్‌

Advertisement
Author Image