For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... ఇంటెన్స్ లుక్ లో చైతూ !

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
naga chaitanya   అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్    ఇంటెన్స్ లుక్ లో చైతూ
Advertisement

Naga Chaitanya : అక్కినేని నట వారసుడు నాగచైతన్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌ లో దూసుకుపోతున్నారు. పేరుకు సినిమా బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునల పేరును కాపాడుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కాగా ఇప్పుడు నాగ చైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తుండగా... అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చైతూ ఇంటెన్స్ ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్. NC22 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ పోస్టర్ లో చూస్తుంటే చైతూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. చుట్టూ చేతులు, తుపాకులు వాటి మధ్యలో చైతన్య ఇంటెన్స్ లుక్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Advertisement GKSC

ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ చైతన్యకు మొదటి తమిళ చిత్రం కాగా... వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడం మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Advertisement
Author Image