For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చూపించారు

11:08 PM Dec 05, 2021 IST | Sowmya
Updated At - 11:08 PM Dec 05, 2021 IST
తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చూపించారు
Advertisement

బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది, కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాపై అంచనాలు విప‌రీతంగా పెరిగాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

సెకండ్ సింగిల్ ‘నా కోసం’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. నేడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది.

Advertisement GKSC

నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Naa Kosam Song From Bangarraju Unveiled,Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty,Kalyan Krishna Kurasala,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,1నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం :

కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image