For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నాకు "రజినీకాంత్" గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి: హీరో ఆకాష్ పూరి

07:09 AM Nov 10, 2021 IST | Sowmya
Updated At - 07:09 AM Nov 10, 2021 IST
నాకు  రజినీకాంత్  గారు అంటే చాలా ఇష్టం  ఆయనే నాకు స్ఫూర్తి  హీరో ఆకాష్ పూరి
Advertisement

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను సోమవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రొమాంటిక్‌ చిత్రయూనిట్ పాల్గొంది.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నన్ను అందరూ అంగీకరించే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్, హ్యాపీ, ఫన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తాను. నేను మొదటి సారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను. నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను అని అనుకున్నాను. కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ క‌థ‌ను నమ్మి చేశాం. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. అంతా చూశాక.. ఇంత బాగా ఎలా నటించావ్‌రా అని అన్నారు.

Advertisement GKSC

నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించారు. నాన్న గారు చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగిరేస్తారు. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను’ అని అన్నారు.

My Favorite Hero Rajanikanth,Hero Akash Puri in Romantic Movie Sucess Meet,Heroine Kethika Sharma,Director Puri Jagannadh,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image