For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Happy Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత 🙏🙏🙏

09:43 AM Jan 13, 2022 IST | Sowmya
Updated At - 09:43 AM Jan 13, 2022 IST
happy vaikunta ekadasi   వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత 🙏🙏🙏
Advertisement

🙏🙏🙏 వైకుంఠ ఏకాదశి చతుర్మాస్యం 4 నెలలు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మేల్కొనే రోజు.. ఈ రోజు జరిపే ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెల్సా... కృతయుగంలో ముర అనే రాక్షసుడు బ్రహ్మ వలన అనేక వరలను పొంది వర గర్వంతో దేవతలని సాధువులని అమాయకమైన ప్రజలను హింసిస్తు ఉండటం వల్ల ఈ అసుర బాధలు భరించలేక దేవతలందరు బ్రహ్మతో సహా వైకుంఠoలో ఉన్న ఉత్తరద్వారాo గుండా శ్రీ మన్నారాయణ్ణుని దర్శించి తమ బాధలను విన్నవించు కుంటారు.. అప్పుడు ఆ మహా విష్ణువు మురసురుణ్ణి సంహారించేదుకు యుద్ధం మొదలు పెడతాడు. అప్పుడు మురసురుడు సాగర గర్భం లోకి వెళ్లి దక్కుంటాడు. అతన్ని బయటకి రప్పించేందుకు స్వామివారు ఒక ఉపయాన్ని పన్ని ఉత్తరం వైపు ఉన్న ఒక గుహలోకి వెళ్లి నిద్రస్తున్నట్లు నటిస్తూ పడుకుంటాడు.

ఇదంతా తెలియని మురాసురుడు అదే అదును అనుకోని మహా విష్ణువుని వాదించేందుకు కత్తి ఎత్తగానే ఆ యోగ మాయ మహాలక్ష్మి దుర్గా దేవి రూపంలో ప్రత్యేక్షమై ఆ రాక్షసున్ని వదిస్తుంది... ప్రసన్నడైన ఆ పరమాత్మ అమ్మకి ఏకాదశి అని బిరుదును ప్రసాదిస్తాడు.. అప్పుడు 3 కోట్ల మంది దేవతలు గరుడ వాహనం దివి నుండి భువికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవటం వల్ల ఈరోజు ముక్కోటి ఏకాదశిగాను వైకుంఠ ఏకాదశి గాను ప్రశాస్ట్యాన్ని సంతరించు కుంది.. పురాణాల్లో పర్వత రాజు సలహా మేరకు వైఖణసుడు అనే రాజు ఈరోజు వైకుంఠ ఏకాదశి వ్రతంని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న తన పితృ దేవతలకు విముక్తి కలిగించడని పురాణాల్లో చెప్పబడింది.

Advertisement GKSC

సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించటానికి ఈ ఉత్తర ద్వారం ఒక శుభ సంకేతం అయింది.. దక్షిణ యాణంలో మరణించిన పుణ్యాత్ములు అందరు ఈరోజు ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశిస్తారు అని పురాణాలూ చెప్తున్నాయి... ఈరోజు నువ్వులు. నెయ్యి. పండ్లతో మహా విష్ణువుని పూజించి ఉపవాస వ్రతం పాటించిన వారికి వైకుంఠo ప్రాప్తిస్తుందని చెప్పబడింది... ఓం నమో నారాయణాయ....🙏🙏🙏Mukkoti Ekadasi Speciality, vaikunta ekadasi subhakankshalu,happy vaikunta ekadasi 2022,Bhakthi News,Devotional Special Storys,telugu golden tv,bhakthi omkaram,teluguworldnow.com

Advertisement
Author Image