For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం మడ్డి: దిల్‌రాజు

10:22 PM Dec 08, 2021 IST | Sowmya
Updated At - 10:22 PM Dec 08, 2021 IST
film news  భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం మడ్డి  దిల్‌రాజు
Advertisement

మ‌డ్డి టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి, భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..

దిల్‌రాజు మాట్లాడుతూ - ``మ‌డ్డి సినిమా మేకింగ్ వీడియోలు మ‌రియు టీజ‌ర్, ట్రైల‌ర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న మ‌డ్డి అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

Advertisement GKSC

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Muddy Movie Released by Dil Raju in Telugu,Dr Pragabhal,Yuvan,Ridhan,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.latest telugu movies,

Advertisement
Author Image