For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

‘మిస్టర్‌ కింగ్‌’ అందరూ తప్పకుండా చూడాల్సిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో శరణ్‌ కుమార్‌

09:21 AM Feb 13, 2023 IST | Sowmya
Updated At - 09:21 AM Feb 13, 2023 IST
‘మిస్టర్‌ కింగ్‌’ అందరూ తప్పకుండా చూడాల్సిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్   హీరో శరణ్‌ కుమార్‌
Advertisement

విజయనిర్మల గారి మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు)  హీరోగా, శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్టర్‌ కింగ్‌’. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలుగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న ‘మిస్టర్‌ కింగ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

శరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కూడా గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. నిర్మాత బిఎన్ రావు గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. శశిగారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు.

Advertisement GKSC

సునీల్, తనికెళ్ళ భరిణి, మురళి శర్మ ,వెన్నల కిషోర్ లాంటి సినియర్లతో పని చేయడం గొప్ప అనుభవం. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నా మొదటి సినిమా. మీ అందరి సపోర్ట్, ప్రేమ కావాలి. అందరూ 24న సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

తారాగణం : శరణ్‌ కుమార్‌, యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌, ఆశిమ నర్వాల్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, సునీల్, వెన్నెల కిషోర్, ఎస్ఎస్ కాంచి, శ్వేతా, ఐడ్రీం అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీనిధి గూడూరు తదితరులు.

టెక్నికల్ టీం :
రచన, ఎడిటింగ్, దర్శకత్వం:  శశిధర్‌ చావలి
నిర్మాత: బిఎన్ రావు
సహా నిర్మాత: రవి కిరణ్ చావలి
బ్యానర్ : హన్విక క్రియేషన్స్
మ్యూజిక్: మణిశర్మ
డీవోపీ: తన్వీర్
పీఆర్వో : వంశీ- శేఖర్

Advertisement
Author Image