హై టెక్నికల్ వాల్యూస్ తో విష్ణు మంచు, కాజల్ "మోసగాళ్ళు" చిత్రం: మెగాస్టార్ చిరంజీవి.
02:11 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:11 PM May 11, 2024 IST
Advertisement
డీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు తాజాగా ఆయన నటిస్తూ నిర్మించిన చిత్రం "మోసగాళ్ళు". ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో "మోసగాళ్ళు" చిత్రాన్ని నిర్మించారు.
రియల్ ఇన్సిడెంట్స్ తో ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 25న రిలీజ్ చేశారు.. ఈ సందర్బంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Advertisement