For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తండ్రి కూతుళ్లు మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న "అగ్ని నక్షత్రం"

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
తండ్రి కూతుళ్లు మొట్ట మొదటి సారిగా కలిసి నటిస్తున్న  అగ్ని నక్షత్రం
Advertisement

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం "అగ్ని నక్షత్రం". విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీ నటులుగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు మరియు లక్ష్మీ ప్రసన్న లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఈరోజు ఉదయం 9:29 గంటలకు ఘనంగా జరిగింది.

తండ్రీ కూతుళ్ళైన కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటిది సారిగా కలిసి నటించడం విశేషం. మంచి ముహూర్తాన "అగ్ని నక్షత్రం" అనే టైటిల్ రివీల్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. ఇప్పుడు రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందింది అని అర్థం అవుతుంది.ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోశించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. Mohan Babu, Manchu Lakshmi's first collaboration titled Agni Nakshatram,Director Samuthirakani,Malayali actor Siddique,telugu golden tv,my mix entertainements,v9 media,www.teluguworldnow.comనటీ నటులు: కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్, చైత్ర శుక్ల తదితరులు

Advertisement GKSC

సాంకేతిక నిపుణులు: బ్యానర్స్ : శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌ టైన్‌మెంట్స్, నిర్మాతలు : డా, మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, దర్శకత్వం : ప్రతీక్ ప్రజోష్, సంగీతం: లిజో కె జోస్, ,DOP: గోకుల్ భారతి, ఎడిటర్ : మధురెడ్డి

Advertisement
Author Image