For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఏప్రిల్ 1 న విడుదల అవుతున్న "మిషన్ ఇంపాజిబుల్"

10:15 PM Mar 24, 2022 IST | Sowmya
Updated At - 10:15 PM Mar 24, 2022 IST
ఏప్రిల్ 1 న విడుదల అవుతున్న  మిషన్ ఇంపాజిబుల్
Advertisement

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్  స్వరూప్ RSJ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌లే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ఇందులో న‌టించిన ముగ్గురు పిల్ల‌ల న‌ట‌న హైలైట్‌ గా నిలిచింది. దావూద్ ఇబ్ర‌హం అనే వ్య‌క్తిని ప‌ట్టుకునే క్ర‌మంలో వారికి ఎదురైన స‌మ‌స్య‌లు ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా తాప్సీ న‌టించింది. ఇటీవ‌లే విడుద‌లైన పాట‌కు మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. తెలుగులో డిఫ‌రెంట్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన,  టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించారు.Mission Impossible, released on April 1, completes censorship.Swarrop RSI Director,Taapsee Pannu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement GKSC

సాంకేతిక సిబ్బంది: బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, రచయిత, దర్శకుడు: స్వరూప్ RSJ, నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సహ నిర్మాత: N M పాషా, సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా, సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్, ఎడిటర్: రవితేజ గిరిజాల,  ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర, PRO: వంశీ శేఖర్

Advertisement
Author Image