For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణలోని గోల్కొండ, వేయి స్తంభాల గుడి, బాసర , చార్మినార్ లకు కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించవలసిందిగా యునెస్కోకు విజ్ఞప్తి: తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్

03:29 PM Sep 02, 2021 IST | Sowmya
Updated At - 03:29 PM Sep 02, 2021 IST
తెలంగాణలోని గోల్కొండ  వేయి స్తంభాల గుడి  బాసర   చార్మినార్ లకు కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించవలసిందిగా యునెస్కోకు విజ్ఞప్తి  తెలంగాణ రాష్ట్ర అబ్కారీ  క్రీడా  పర్యాటక  సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి  శ్రీనివాస్ గౌడ్
Advertisement

Minister V Srinivas Goud, Central Archaeological Department Director Smt Vidyavathi, (UNESCO), Ramappa Temple Warangal, Telangana News, Telugu World Now,

తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీమతి విద్యావతి గారిని ఢిల్లీలో కలిశారు.

Advertisement GKSC

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లో తెలంగాణలోని రామప్ప దేవాలయం వరంగల్ కు ప్రత్యేక గుర్తింపు కల్పించినందుకు వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారై ఉండి ఈ గుర్తింపు రావడం కోసం కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని గోల్కొండ , వేయి స్తంభాల గుడి, బాసర , చార్మినార్ లకు కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించవలసిందిగా యునెస్కో నకు ప్రతిపాదించ వలసిందిగా వారిని కోరారు. హైదరాబాదులోని గోల్కొండ లో గల సౌండ్ అండ్ లైట్ షో ను నవీనీకరణ చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుండి పర్యాటకులకు అనువుగా ఉండే రాణి మహల్ కు మార్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

భారత పురావస్తు సర్వే (ASI) వారి బృందాన్ని తెలంగాణలోని హైదరాబాదును సందర్శించి యాదాద్రి, భద్రాచలం ,మహబూబ్ నగర్ లోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సందర్శించవలసిందిగా కోరారు . ఆ దేవాలయాల అభివృద్ధికి నిధులను విడుదల చేయవలసిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎంతో కృషి చేసి అధునాతన టెక్నాలజీ ద్వారా నిర్మింపజేసిన యాదాద్రి దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరారు.

minister v srinivas goud,Central Archaeological Department director smt padmavavi,(UNESCO),v9 news telugu,teluguworldnow.com,telugu golden tv,.1ఈ కార్యక్రమం లో తెలంగాణ టూరిజం MD మనోహర్, E D శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

minister v srinivas goud,Central Archaeological Department director smt padmavavi,(UNESCO),v9 news telugu,teluguworldnow.com,telugu golden tv,.1

minister v srinivas goud,Central Archaeological Department director smt padmavavi,(UNESCO),v9 news telugu,teluguworldnow.com,telugu golden tv,.1

Advertisement
Author Image