For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Happy Christmas Wishes Telugu 2023 : క్రిస్మస్ ప్రత్యేక శుభాకాంక్షలు మీకోసం.. మీ ఫ్రెండ్స్‌కి ఇలా సులభంగా పంపండి.

10:33 PM Dec 24, 2023 IST | Sowmya
Updated At - 10:33 PM Dec 24, 2023 IST
happy christmas wishes telugu 2023   క్రిస్మస్ ప్రత్యేక శుభాకాంక్షలు మీకోసం   మీ ఫ్రెండ్స్‌కి ఇలా సులభంగా పంపండి
Advertisement

Happy Christmas Wishes Telugu 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండగను క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ పండగను జరుపుకుంటారు. యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ఈ క్రిస్మస్ పండగను జరుపుకుంటారు. భారతదేశవ్యాప్తంగా క్రిస్మస్ పండగను క్రైస్తవులు జరుపుకోవడమే కాకుండా అన్ని మతాల ప్రజలు ఈ పండగలో పాల్పంచుకుంటారు. ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న పండగను పురస్కరించుకొని మీ క్రైస్తవ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు స్పెషల్ కోట్స్ ద్వారా తెలియజేసి రోజంతా వారి ఆనందాన్ని పంచుకోండి.

క్రిస్మస్ సందర్భంగా చాలామంది క్రైస్తవులు కొత్త దుస్తులను ధరించి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.. అంతేకాకుండా మరికొంతమంది ఇంట్లో క్రిస్మస్ చెట్టును అందంగా అలంకరించుకొని స్వీట్లు పంచుకుంటారు..ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్రిస్మస్ పండగను జరుపుకుంటారు.

Advertisement GKSC

క్రిస్మస్ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు:
✾ మీరు, మీ కుటుంబ సభ్యులు యేసుప్రభు కరుణ వల్ల జీవితం మొత్తం సంతోషం ఆనందంతో గడపాలని కోరుకుంటూ..మేరీ క్రిస్మస్..

✾ దేవదూత రూపంలో యేసుప్రభు ఈ క్రిస్మస్ పండగ రోజు మీ ఇంటికి వచ్చి ఆనందాన్ని అందించాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.

✾ పవిత్రమైన హృదయంతో క్రిస్మస్ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ..మేరీ క్రిస్మస్..

✾  క్రిస్మస్ తాత మీ జీవితంలో బోలెడు బహుమతులు అందించాలని ఆకాంక్షిస్తూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.

✾ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ ఆ యేసు ప్రభువు కరుణ వల్ల తొలగిపోవాలని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు.. మేరీ క్రిస్మస్..

Advertisement
Author Image