For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య"@ 200 కోట్లు...

09:49 PM Jan 24, 2023 IST | Sowmya
Updated At - 09:49 PM Jan 24, 2023 IST
waltair veerayya   మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య   200 కోట్లు
Advertisement

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”. సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వాల్తేరు వీరయ్య సినిమా తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాతో ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్న మెగాస్టార్ కి సూపర్ విక్టరీ దక్కిందని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తుకు వస్తున్నారు అని అభిమానులు అంటున్నారు.

Advertisement GKSC

బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దుమ్ము లేపుతుంది ఈ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్ లో మెగాస్టార్‌ చిరంజీవి కొత్త పోస్టర్‌కు కూడా రిలీజ్‌ చేసింది. కాగా మెగాస్టార్ కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూడో సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. అంతకు ముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్‌ను కూడా వాల్తేరు వీరయ్య చిత్రం షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 2.25 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు ఈ సినిమాను అమెరికాలో విడుదల చేసిన శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్‌ చేసింది.

Advertisement
Author Image