For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#Mega157 : మెగాస్టార్ చిరంజీవి మెగా157 పీప్రొడక్షన్ పనులు ప్రారంభం

10:39 PM Sep 10, 2023 IST | Sowmya
Updated At - 10:39 PM Sep 10, 2023 IST
 mega157   మెగాస్టార్ చిరంజీవి మెగా157 పీప్రొడక్షన్ పనులు ప్రారంభం
Advertisement

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వశిష్ట దర్శకత్వంలో అనౌన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ #మెగా157 అభిమానుల మెగా సెలబ్రేషన్స్ ని రెట్టింపు చేసింది. పంచభూతాలతో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ సోషల్ మీడియా & ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈరోజు చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి డివోపీగా పని చేస్తారని కూడా ఆయన తెలియజేశారు.

Advertisement GKSC

“ మెగా ఫిల్మ్ కి మెగాస్టార్🌟. #మెగా157 ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం. త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వంచర్ కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ట్వీట్ చేసిన వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపి తో కలసివున్న ఫోటోని షేర్ చేశారు. ఈ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ ప్రాజెక్ట్ కు సంబధించిన ఇతర తారాగణం, టెక్నికల్ టీంను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Advertisement
Author Image