For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : పవన్ తీరు చూసి నక్సలైట్ అయిపోతాడేమో అని భయం వేసింది. మెగాస్టార్..

08:55 PM Feb 10, 2023 IST | Sowmya
Updated At - 08:55 PM Feb 10, 2023 IST
entertainment   పవన్ తీరు చూసి నక్సలైట్ అయిపోతాడేమో అని భయం వేసింది  మెగాస్టార్
Advertisement

Entertainment మెగాస్టార్ చిరంజీవి తాజాగా నిజం విత్ స్మిత టాక్ షోకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఇప్పటివరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి సైతం కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పటి వరకు చెప్పకు వచ్చారు. అలాగే తాజాగా నిజం విత్ స్మిత టాక్ షో కు హాజరైన ఈయన.. పవన్ తీరి చిన్నప్పటినుంచి చాలా విచిత్రంగా ఉండేదని ఆయన సమస్యలు చూసి స్పందించే తీరు చూసి నక్సలైట్ అయిపోతాడేమో అని భయపడే వాడిని అంటూ తెలిపారు అలాగే.. "పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే సినీ నటుడిగా ఏదంటే మీకు ఇష్టం.. " అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి "పవన్ కళ్యాణ్‌ సహజత్వంగా, తన నేచర్‌ను బట్టి అయితే అతను ఏదో ఒక రోజు కచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. బాధలకు స్పందించే తీరు, ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచీ ఉంది. దాని కోసమే ఒకానొక సమయంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. గన్‌లతో ఎక్కువగా ఆడేవాడు. నేను షూటింగ్‌లకు సింగపూర్ వెళ్తే.. అన్నయ్య అక్కడ గన్స్ దొరకుతాయి, ఇక్కడ దొరకట్లేదు తీసుకురా అనేవాడు. అవీ డమ్మీ గన్సే కానీ.. సెమీ ఆటోమేటిక్. అలా గన్‌లతో తిరుగుతుంటే ఒకసారి రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ గన్ అని తెలిశాక వదిలారు.  అందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ తనకు మాత్రం భక్తులు ఉంటారు. కాబట్టి నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం అతని ఉంది.. "అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement GKSC

Advertisement
Author Image