For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie చిరంజీవి కోసం అక్కడికి వెళ్లి పోలీసులకి అడ్డంగా బుక్ అవ్వడమే కాదు.. లాఠీ దెబ్బలు కూడా తిన్న ఓ స్టార్ హీరో

12:16 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:16 PM May 13, 2024 IST
movie చిరంజీవి కోసం అక్కడికి వెళ్లి పోలీసులకి అడ్డంగా బుక్ అవ్వడమే కాదు   లాఠీ దెబ్బలు కూడా తిన్న ఓ స్టార్ హీరో
Advertisement

Movie మైగస్టార్​ చిరంజీవి శ్రీకాంత్​ మధ్య మంచి అనుబంధం ఎంతో ప్రత్యేకం. వీరిద్దరు కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించారు. ఇక శ్రీకాంత్.. పలు సందర్భాల్లో చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఆయన్ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా మారోసారి చిరుపై తనకున్న ప్రేమను తెలియజేశారు. ఓ సందర్భంగా చిరు కోసం పోలీసు దెబ్బలు తిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు చిరంజీవితో పాటు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.

Advertisement GKSC

"మొదటి నుంచి నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండలేను. ముఖ్యంగా వేట సినిమా సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఎక్కువ రష్ ఉండేది. ఇప్పుడిలా ఆన్ లైన్​లో టికెట్స్ లేవు. దీంతో 5 గంటలకు షో అయితే.. 3 గంటలకే సైకిల్ వేసుకొని థియేటర్ వద్ద ఎదురుచూసేవాళ్లం. ఆ సమయంలో పోలీసులు వచ్చేశారు. ఇక లాఠీ ఛార్జ్ మొదలు.. అలా చిరంజీవి అన్న సినిమా కోసం దెబ్బలు కూడా తిన్నాను. బాగా గట్టిగా కొట్టారు. అయినా టికెట్ తీసుకొని సినిమా చూశాను. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఈ విషయాలను అన్నయ్య ముందు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

Advertisement
Author Image