For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా "గాడ్ ఫాదర్"

09:59 PM Feb 18, 2022 IST | Sowmya
Updated At - 09:59 PM Feb 18, 2022 IST
హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా  గాడ్ ఫాదర్
Advertisement

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా `గాడ్ ఫాదర్’ ను ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో న‌య‌న‌తార పాల్గొంది. హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌యిన‌ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా, హీరోయిన్ న‌య‌న‌తార ఫోటోను షేర్ చేసింది చిత్ర యూనిట్‌.
Megastar Chiranjeevi - Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather’s Hyderabad Schedule Wrapped Up.telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు. న‌య‌న‌తార పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉండ‌నుంది. ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా, నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, సమర్ఫణ: కొణిదెల సురేఖ, బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్, సంగీతం: ఎస్ఎస్ తమన్, సినిమాటోగ్రఫర్: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాఘవన్, ఎక్స్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావ్, పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement GKSC

Advertisement
Author Image