For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్' ట్రైలర్ జూలై 27న

08:59 PM Jul 23, 2023 IST | Sowmya
Updated At - 08:59 PM Jul 23, 2023 IST
మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  భోళా శంకర్  ట్రైలర్ జూలై 27న
Advertisement

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు.

భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నారు. మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు బిగ్ ఎంటర్ టైమెంట్ రాబోతోంది. పోస్టర్‌లో చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు.

Advertisement GKSC

తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement
Author Image