For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : దర్శకుడు బాబీ కొల్లి

12:44 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:44 PM May 13, 2024 IST
మెగాస్టార్  చిరంజీవి  మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య   దర్శకుడు బాబీ కొల్లి
Advertisement

పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' లోని నాల్గవ పాటను చూడండి.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల 'పూనకాలు లోడింగ్' పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ''డోంట్ స్టాప్ డ్యాన్సింగ్..  పూనకాలు లోడింగ్'' అనడం పూనకాలని రెట్టింపు చేసింది.

Advertisement GKSC

'పూనకాలు లోడింగ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ..  మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రవితేజ ఫ్యాన్స్ కి అందరికీ వందనం. బాస్ పార్టీ పాటని ఐపాడ్ లో పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబు గారికి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్ గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే వుంటాయి.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం వాల్తేరు వీరయ్య. సినిమా అంతా జాతరలా వుంటుంది. ఇంత పూనకాలు తెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి థాంక్స్.ఇంత గొప్ప మ్యాజిక్ స్క్రీన్ ప్రజన్స్ వున్న  ఇద్దరి గొప్ప స్టార్స్ ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్. 13వ తేదిన పూనకాలు లోడింగ్ ఎనర్జీ ఏ స్థాయిలో వుంటుందో అందరూ చూడబోతున్నారు' అన్నారు.

Advertisement
Author Image