For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను - మెగాస్టార్ చిరంజీవి

03:59 PM Sep 07, 2021 IST | Sowmya
Updated At - 03:59 PM Sep 07, 2021 IST
film news  ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను   మెగాస్టార్ చిరంజీవి
Advertisement
Megastar Chiranjeevi Launched Teaser Of Hero Aadhi Pinisetty, Heroine Akansha Singh, Director Prithivi Adithya’s "Clap" movie, Latest Telugu Movies, Telugu world now,
FILM NEWS: మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించిన ఆది పినిశెట్టి, ఆకాంక్ష‌సింగ్‌, పృథ్వి ఆదిత్య `క్లాప్` టీజ‌ర్‌

ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ క్లాప్ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్‌చేయ‌డం ద్వారా ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టారు చిత్ర యూనిట్‌. ఈ మూవీ టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.  ఈ సంద‌ర్భంగా..

Advertisement GKSC

నేను ఈ రోజు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం క్లాప్ టీజర్‌ను విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది.  నా స్నేహితుడు, దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి ఒక బహుముఖ నటుడు. అతన్ని మా కుటుంబ సభ్యుడిలా భావిస్తాం. రామాంజనేయులు, కార్తికేయ మరియు రాజశేఖర్ రెడ్డి క‌లిసి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. యువ దర్శకుడు పృథ్వి ఆదిత్య దీనికి దర్శకత్వం వహించారు.  కొత్త ద‌ర్శ‌కులు ఒక సినిమాకు ఏం ఏం కావాలో వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు, అలాగే వారి ప్రతిభను పూర్తిగా  ప్రదర్శిస్తారు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ సినిమా కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం అద్భుతమైన ఆలోచన. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ఆడియ‌న్స్‌ని నిరాశపరచలేదు.

టీజ‌ర్ చూస్తుంటే క్లాప్ కూడా  ఒక  అథ్లెట్ ఫిలిం అనిపిస్తుంది. ఆది ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించాడ‌ని తెలుస్తోంది. అలాగే  ఆయ‌న పాత్రలో ఒక ట్విస్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అది చూసి వావ్ అనుకున్నాను. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను.  ఆది మరియు పృథ్వి స‌హా ఎంటైర్ యూనిట్‌కి  నా శుభాకాంక్షలు.ఈ సినిమా పెద్ద విజయం సాధించాల‌ని ఆశిస్తున్నాను ” అన్నారు.

టీజర్ విషయానికి వస్తే, ఇది ఒక దూకుడు స్వభావం కలిగిన యువ స్ప్రింటర్ యొక్క ఇన్స్‌పైరింగ్ స్టోరీ అని తెలుస్తోంది. త‌న‌ కలలను నెరవేర్చుకోవడానికి అతనికి పెద్దగా మద్దతు లభించక పోవ‌డం టీజ‌ర్‌లో చూడొచ్చు. అలాగే అత‌నికి హాకీ ప్లేయర్ అయిన ఆకాంక్ష సింగ్ స్నేహితురాలు అని చూపించారు. చివ‌ర‌లో  వ‌చ్చే ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అథ్లెట్‌గా ఆది అసాధారణమైన ప్రదర్శన, పృథ్వీ ఆదిత్య అద్భుతమైన రచన మరియు టేకింగ్, ప్రవీణ్ కుమార్ ఆకట్టుకునే కెమెరా పనితనం మరియు మాస్ట్రో ఇళయరాజా హృదయాన్ని తాకే BGM తో ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది.

రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్) మరియు M రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మించారు. ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త్వ‌ర‌లో ట్రైల‌ర్ మ‌రియు ఆడియోను విడుద‌ల‌య‌చేయ‌నున్నారు మేక‌ర్స్‌. క్లాప్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

తారాగ‌ణం :
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్

సాంకేతిక వ‌ర్గం :
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: పృథ్వి ఆదిత్య‌
నిర్మాత‌లు: రామాంజనేయులు జవ్వాజీ , M రాజశేఖర్ రెడ్డి
బ్యాన‌ర్స్‌: సర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ‌  షిర్డీ సాయి మూవీస్
స‌మ‌ర్ప‌ణ‌: ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌)
సంగీతం: ఇళ‌య‌రాజా
డిఒపి: ప్ర‌వీణ్ కుమార్‌
మాట‌లు: వ‌న‌మాలి
ఆర్ట్‌: వైర‌బాల‌న్ & ఎస్ హ‌రిబాబు
ఎడిట‌ర్‌: ర‌ఘు
పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్‌

Advertisement
Author Image