Megastar Chiranjeevi : పరోక్షంగా ఆయనను గుర్తు చేసుకున్న మెగాస్టార్... లేరు కదా అంటూ !
Megastar Chiranjeevi : ఇటీవల ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖులు గరికపాటిపై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా మరోసారి గరికపాటి అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా చిరునే పరొక్షంగా గరికపాటిపై సెటైర్ వేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అలయ్ బలయ్ కార్యక్రమంలో అతిథులుగా గరికపాటి, చిరు పాల్గొన్నారు. కాగా పలువురు మహిళలు చిరంజీవితో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఫోటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ గరికపాటి మాట్లాడారు. దీంతో చిరు సైలెంట్ గా వెళ్లి ఆయన పక్కనే కూర్చుని ప్రవచనాలు విన్నారు. అయితే చిరు పై గరికపాటి చేసిన కామెంట్స్ తో మెగా అభిమానులు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో గరికపాటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు సైతం గరికపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రచించిన శూన్యం నుంచి శిఖరాగ్రాలకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడిన అనంతరం ఆయనతో ఫోటోస్ దిగడానికి అక్కడున్న కొంతమంది మహిళలు స్టేజ్ పైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ... ఇక్కడ వారు లేరు కదా అంటూ వేలు పైకి చూపిస్తూ పరొక్షంగా గరికపాటిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.