Entertainment : కైకాల తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి..
Entertainment టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ (87) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కైకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు తాజాగా చిరంజీవి కైకాల తో ఉన్న తన అనుబంధం కోసం చెప్పుకొచ్చారు..
సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు చిరంజీవి.. అలాగే ‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు... " అంటూ చెప్పుకొచ్చారు. సత్యానారాయణ భోజనం అంటే ఎంతో ఇష్టమని.. అలాగే తన సతీమణి సురేఖ చేతివంట అంటే ఎంతో ఇష్టంగా తినేవారిని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.. అలాగే కొన్నాళ్ల క్రితం ఆయన పుట్టినరోజుకు చిరంజీవి సురేఖ అతను ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు.. ఆ సంద్భంను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి పెనవేసుకున్నారు చిరు.. గత ఏడాది ఆయన పుట్టినరోజుకు ఇంటికి వెళ్లిన సందర్భంలో సురేఖను చూస్తూ 'అమ్మ ఉప్పు చాప వండి పంపించు' అని అన్నారు.. 'మీరు తొందరగా కోలుకోండి.. ఉప్పు చేప తో భోజనం చేద్దాం' అని చెప్పినట్టు గుర్తు చేసుకొని ఎమోషన్ అయ్యారు చిరు.