For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#MEGA154: మెగా154 లో హీరోయిన్ గా శ్రుతి హాసన్

09:27 AM Mar 10, 2022 IST | Sowmya
Updated At - 09:27 AM Mar 10, 2022 IST
 mega154  మెగా154 లో హీరోయిన్ గా శ్రుతి హాసన్
Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్‌ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ మెగా 154 చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగుల తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది.

మెగా154 కోసం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో  మహిళా దినోత్సవం సంద‌ర్భం గా హీరోయిన్‌ గా శృతి హాసన్‌ ను ఎంపిక‌చేసిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా "ఈ మహిళా దినోత్సవం నాడు, మీకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది, మీరు #Mega154 కి స్త్రీ శక్తి ని తీసుకు వచ్చారు" అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Advertisement GKSC

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో శ్రుతిహాసన్‌ కి ఇది తొలి కాంబినేష‌న్ కావ‌డం విశేషం.  నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది, అయితే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Welcome Shruti Haasan On Board For Mega154 On This Women’s Day,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com.1

మెగా154 కి చిరంజీవి కి అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌ గా నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

Advertisement
Author Image