For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఆవిష్క‌రించిన‌  "షికారు" చిత్రంలోని "మ‌న‌సు దారి త‌ప్పెనే" పాట‌

10:44 PM Feb 07, 2022 IST | Sowmya
Updated At - 10:44 PM Feb 07, 2022 IST
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఆవిష్క‌రించిన‌   షికారు  చిత్రంలోని  మ‌న‌సు దారి త‌ప్పెనే  పాట‌
Advertisement

సాయి ధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్  ల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ‌మ‌తి వాగేశ్వ‌రి(ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ ప‌తాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం `షికారు`. హరి కొలగాని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన మ‌న‌సు దారి త‌ప్పెనే.. పాట‌ను మెగాహీరో వ‌రుణ్ తేజ్ ఈ రోజు విడుద‌ల చేశారు.

మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే..మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే
అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెద‌విపై న‌వ్వు ఆగ‌నె ఆగ‌దే..ఆగ‌నె ఆగ‌దే
నీ వంటి మెరుపు చూసె  వ‌ర‌కూ ఎంత‌టి అంద‌మో ఊహ‌కి అంద‌లే...అంటూ సాగే ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీ‌రామ్ త‌న వాయిస్‌లోని మ్యాజిక్‌ను మ‌రోసారి రిపీట్ చేశారు. శేఖ‌ర్ చంద్ర బాణీలు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
Mega Prnce Varun Tej Launched Manasu Dari Tappene Song From Shikaru Movie,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,latest telugu movies.తారాగణం : సాయి ధ‌న్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్, కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, సురేఖా వాణి.

Advertisement GKSC

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్‌: శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, ప్రొడ్యూసర్: పి.ఎస్.ఆర్ కుమార్ (బాబ్జి, వైజాగ్ ), స్టోరీ -స్క్రీన్ ప్లే  డైరెక్షన్: హరి కొలగాని, కో -ప్రొడ్యూసర్: సాయి పవన్ కుమార్, డి ఓ పి: వసిలి శ్యామ్ ప్రసాద్, మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శేఖర్ చంద్ర, డైలాగ్స్: విశ్వ కరుణ్, ఆర్ట్ డెరెక్టర్: షర్మిల ఎలిశెట్టి, ఎడిటర్: వెంకటేశ్వరరావు శృంగవరపు
లిరిక్స్: భాస్కర్ భ‌ట్ల, చీఫ్ కో డైరెక్టర్: సురేష్ నది కొప్పుల, కొరియోగ్రాఫర్: సుభాష్ సారికొండ, యాక్షన్: రొబ్బిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్: వెంకటేష్ ఏస్. కె. కులపాక, ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాసరావు, పిఆర్ ఓ: తేజస్వి సజ్జ‌.

Advertisement
Author Image