For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'మీట్ క్యూట్' మనసుకు హాయినిచ్చే బ్యూటీఫుల్ ఎంథాలజీ : నాని

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
 మీట్ క్యూట్  మనసుకు హాయినిచ్చే బ్యూటీఫుల్ ఎంథాలజీ   నాని
Advertisement

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఎంథాలజీ "మీట్ క్యూట్". నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోహిస్తున్న 'మీట్ క్యూట్" ఎంథాలజీ " నవంబర్ 25న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యంలో  'మీట్ క్యూట్" 'మీట్ క్యూట్" ప్రీస్ట్రీమింగ్ సెలెబ్రెషన్స్ గ్రాండ్ గా జరిగాయి.

హీరో నాని మాట్లాడుతూ.. 'మీట్ క్యూట్" చాలా క్యూట్ ఎంథాలజీ. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ఇందులో ఐదు కథలు వున్నాయి. 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' కథలో సత్యరాజ్ గారు, రుహాని రాజా చాలా అద్భుతంగా చేశారు. ఇందులో చాలా లైఫ్ లెసన్స్ వున్నాయి. సందేశంలా కాకుండా చాలా చిన్న విషయాలని చాలా సెటిల్ద్ గా అందంగా ప్రజంట్ చేసే కథ ఇది. 'ఎక్స్ గర్ల్ ఫ్రెండ్' కథలో సంచిత, జిపి, సునయన చాలా బ్యూటీఫుల్ గా చేశారు. అందరూ రిలేట్ చేసుకుంటారు. ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా వుంది.

Advertisement GKSC

'స్టార్‌స్ట్రక్' లో అదా, శివ చాలా క్యూట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. ఇది నా ఫేవరేట్ కథలలో ఒకటి. చాలా అందమైన కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. చాలా ఎంజాయ్ చేస్తారు. 'మీట్ ది బాయ్' లో వర్ష, అశ్విన్ కథ చాలా స్పెషల్. ఇందులో మా పిన్ని, అంజు కూడా డబ్బింగ్ చెప్పింది. నేను అక్కని పరిచయం చేస్తే అక్క మా ఫ్యామిలీని పరిచయం చేస్తోంది. ఈ కథలో చాలా బ్యూటీఫుల్ మూమెంట్స్ వున్నాయి. 'ఇన్ లా'కథలో రోహిణి గారు, ఆకాంక్ష, దీక్షిత్ చేశారు. కాబోయే అత్తా కోడలికి మధ్య జరిగే క్యూట్ కథ. అక్క చాలా అందంగా రాసింది. అంతే అందంగా ఫెర్ ఫార్మ్ చేశారు. చాలా మంచి కంటెంట్ వున్న ఎంథాలజీ ఇది. చాలా మంచి టెక్నికల్ టీం ఈ ఎంథాలజీకి పని చేసింది. అందరికీ పేరుపేరునా థాంక్స్.

నేను లెక్కల్లో వీక్. ప్రశాంతి చాలా  స్ట్రాంగ్. నేను నా పనిని ప్రశాంతంగా చేయగలుగుతున్నా అంటే కారణం ప్రశాంతి నాకిచ్చిన నమ్మకం. విజయ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అక్కని చూస్తే చాలా గర్వంగా వుంది. చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసింది. . 'మీట్ క్యూట్" చాలా హాయిని ఇచ్చే ఎంథాలజీ. ఈనెల 25 తర్వాత మీరు ఎప్పుడైన అలసటగా ఫీలౌతుంటే ఓ సాయంత్రం పూట సరదాగా కూర్చుని  'మీట్ క్యూట్" పెట్టుకొని చూడండి. చాలా హాయిగా నిద్రపోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు''అన్నారు.

Advertisement
Author Image