For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: "అర్జున ఫల్గుణ" డిసెంబర్ 31న విడుదల

08:31 PM Dec 19, 2021 IST | Sowmya
Updated At - 08:31 PM Dec 19, 2021 IST
tollywood updates   అర్జున ఫల్గుణ  డిసెంబర్ 31న విడుదల
Advertisement

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.

నూతన సంవత్సరం సందర్బంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Advertisement GKSC

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Matinee Entertainment and Sree Vishnu’s Arjuna Phalguna Releasing On December 31st,Amritha Aiyer, Senior Naresh,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguwolrdnow.comసాంకేతిక బృందం :
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని
డైలాగ్స్ : సుధీర్ వర్మ. పి
సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి
ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్
యాక్షన్ : రామ్ సుంకర
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి

Advertisement
Author Image