For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "ఖిలాడీ" నుండి "క్యాచ్ మీ పాట" విడుద‌ల‌

07:05 PM Feb 05, 2022 IST | Sowmya
Updated At - 07:05 PM Feb 05, 2022 IST
film news   ఖిలాడీ  నుండి  క్యాచ్ మీ పాట  విడుద‌ల‌
Advertisement

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు  హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ రోజు ఐదో పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

క్యాచ్ మీ అంటూ సాగే ఈ పాటను ర‌వితేజ - డింపుల్ హయాతిల మీద చిత్రీక‌రించారు. ఈ పాటలో  డింపుల్ లుక్స్‌, కిల్ల‌ర్ ప‌ర్స‌నాలిటి, క‌ట్టిప‌డేసే ఎక్స్‌ప్రెష‌న్స్  ప్రేక్ష‌కుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్ విందు ఇచ్చింది డింపుల్‌.

Advertisement GKSC

దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకోసం మ‌రో మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. శ్రీ మ‌ణి సాహిత్యం, నేహా బాషిన్, జ‌స్ప్రీత్ జాస్జ్ గానం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రీలీజ్ చేసిన అన్ని పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi 5th Single Catch Me Launched, ,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు.

Advertisement
Author Image