For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని #RT4GM అనౌన్స్ మెంట్

10:16 PM Jul 09, 2023 IST | Sowmya
Updated At - 10:16 PM Jul 09, 2023 IST
మాస్ మహారాజా రవితేజ  గోపీచంద్ మలినేని  rt4gm అనౌన్స్ మెంట్
Advertisement

మాస్ మహారాజా రవితేజ,  బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారి కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాల్నిపూర్తి చేశారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ని టాలీవుడ్‌ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈరోజు #RT4GM సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు.

గోపీచంద్ మలినేని గత బ్లాక్‌బస్టర్ మూవీస్ క్రాక్, వీరసింహా రెడ్డి లానే వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ అండ్ పవర్ ఫుల్ కథని రాశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో భయానక స్థితిలో వున్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్ గా వున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement GKSC

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించనున్నారు.  ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

https://youtube.com/shorts/-LRuOoMmjf8

తారాగణం : రవితేజ

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: ఎస్ థమన్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పబ్లిసిటీ: బాబా సాయి

Advertisement
Author Image