For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మాస్ మహారాజా ర‌వితేజ‌, దర్శకుడు రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు "ఖిలాడి" టాకీ పార్ట్ పూర్తి.

03:05 PM Sep 25, 2021 IST | Sowmya
Updated At - 03:05 PM Sep 25, 2021 IST
మాస్ మహారాజా ర‌వితేజ‌  దర్శకుడు రమేష్ వర్మ  సత్యనారాయణ కోనేరు  ఖిలాడి  టాకీ పార్ట్ పూర్తి
Advertisement

Mass Maharaja Ravi Teja, Director Ramesh Verma, Satyanarayana Koneru's Movie "Khiladi", Latest Telugu Movies, Telugu World Now.

మాస్ మహారాజా ర‌వితేజ‌, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు `ఖిలాడి` టాకీ పార్ట్ పూర్తి.

Advertisement GKSC

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి

సాంకేతిక బృందం :
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్
ఎడిటర్: అమర్ రెడ్డి
లిరిక్స్: శ్రీ మణి
స్టిల్స్: సాయి మాగంటి
మేకప్: ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు
పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్
కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే
ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌
పీఆర్ఓ: వంశీ-శేఖర్

Mass Maharaja Ravi Teja, Director Ramesh Verma, Satyanarayana Koneru `Khiladi`, Telugu golden tv, my mix entertainments, teluguworldnow .com 1

Advertisement
Author Image