For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie Updates: రవితేజ "ఖిలాడి" సినిమా నుంచి "ఫుల్ కిక్కు పాట" విడుదల

06:13 PM Jan 26, 2022 IST | Sowmya
Updated At - 06:13 PM Jan 26, 2022 IST
movie updates  రవితేజ  ఖిలాడి  సినిమా నుంచి  ఫుల్ కిక్కు పాట  విడుదల
Advertisement

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు.

ఈ మాస్ సాంగ్‌ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. లుంగిలో రవితేజ మాస్ స్టెప్పులు, తెరపై ఆయన ఎనర్జీ అభిమానులకు కన్నుల పండువగా ఉంది.

Advertisement GKSC

Mass Maharaja Ravi Teja, Meenakshi Chaudhary, Dimple Hayathi, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Full Kicku Lyrical Launched,telugu golden tv,my mix entertainments, teluguworldnow.comఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

నటీనటులు : రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్

సాంకేతిక బృందం : కథ, కథనం, దర్శకత్వం : రమేష్ వర్మ,నిర్మాత : సత్యనారాయణ కోనేరు, బ్యానర్ : ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్ : ఏ హవీష్ ప్రొడక్షన్, సమర్పణ : డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్ : సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, స్క్రిప్ట్ కో ఆర్టినేషన్ : పాత్రికేయ, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్ : శ్రీకాంత్ విస్స, సాగర్, ఎడిటర్ : అమర్ రెడ్డి, లిరిక్స్ : శ్రీ మణి, స్టిల్స్ : సాయి మాగంటి,, మేకప్ : ఐ శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మురళీకృష్ణ కొడాలి, ప్రొడక్షన్ హెడ్ : పూర్ణ కండ్రు,పబ్లిసిటీ : రామ్ పెద్దిటి సుధీర్, కో డైరెక్టర్ : పవన్ కేఆర్‌కే, ఆర్ట్ : గాంధీ నందికుడ్కర్, పీఆర్ : వంశీ-శేఖర్.

Advertisement
Author Image