For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Mass Maharaj Raviteja : ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన మాస్ మహారాజ్ రవితేజ..

08:44 PM Jan 19, 2023 IST | Sowmya
Updated At - 08:44 PM Jan 19, 2023 IST
mass maharaj raviteja   ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన మాస్ మహారాజ్ రవితేజ
Advertisement

Mass Maharaj Raviteja : మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి దుమ్ములేపింది. అదే ఊపును కొనసాగిస్తూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా మంచి మాస్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు రవితేజ. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక మెగాస్టార్ సరసన కూడా తమ్ముడి పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. రవితేజ యాక్టింగ్ కి ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు తన అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు మాస్ మహారాజ్.

Advertisement GKSC

జనవరి 26న రవితేజ పుట్టినరోజు కానుకగా ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా.. రవితేజ ఊరమాస్ అవతార్ లో దుమ్ములేపాడు. మరి మిరపకాయ్ మూవీ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement
Author Image